epaper
Tuesday, November 18, 2025
epaper

రోహిత్, కోహ్లీ రిటైర్‌మెంట్ కోసమే ఎదురుచూపులు: అశ్విన్

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ త్వరగా రిటైర్మెంట్ తీసుకోవాలని మేనేజ్‌మెంట్ కోరుకుంటోందని టీమిండియా మాజీ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin) కీలక వ్యాఖ్యలు చేశాడు. ఛాంపియన్ ట్రోఫీ తర్వాత రోహిత్, కోహ్లీ ఇద్దరు మరో సిరీస్ ఆడటానికి రెడీ అవుతున్నారు. ఆస్ట్రేలియాతో జరిగే మూడు వన్డేల సిరీస్ కోసం ప్రకటించిన జట్టులో వీరిద్దరి పేర్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అశ్విన్.. టీమ్ మేనేజ్‌మెంట్‌కు కీలక సూచనలు చేశారు. కెరీర్ చివరిదశలో ఉన్న కోహ్లీ(Kohli), రోహిత్‌(Rohit)లకు అయినా సరైన గౌరవం ఇవ్వాలని కోరారు. అంతేకాకుండా రోహిత్‌ను కెప్టెన్‌ బాధ్యతల నుంచి తప్పించడంపై కూడా స్పందించాడు.

‘‘కాయిన్‌కు ఒకవైపు సెలక్షన్ కమిటీ. మరోవైపు రోహిత్-కోహ్లీ. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కమిటీ నిర్ణయం తీసుకుంది అనిపించింది. అయితే ఇద్దరు సీనియర్ ప్లేయర్లు కెరీర్ చివరి దశలో ఉన్నారు. ఈ సందర్భంగా ఒకే ఒక మాట చెప్పాలనిపించింది. వారిద్దరి విషయంలో అయినా మెరుగైన రీతిలో వ్యవహరించాలి అభిమానుల నుంచి ఇలాంటి కోరికలు ఉంటాయి. మేనేజ్‌మెంట్ మాత్రం వారు త్వరగా వీడ్కోలు చెప్పాలని కోరుకుంటుంది. కొత్త కుర్రవాళ్లకు అవకాశం ఇవ్వడమే వారి ఉద్దేశం. ఇలాంటప్పుడే సీనియర్లతో సరైన కమ్యూనికేషన్ ఉండాలి’’ అని అన్నాడు అశ్విన్(Ravichandran Ashwin).

Read Also: కెప్టెన్‌గా తిలక్ వర్మ.. ఏ జట్టుకంటే..

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>