Mobile Popup Ad
Mobile Popup Ad

గోదావరి పుష్కరాలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం: మంత్రి అడ్లూరి

కలం, కరీంనగర్ బ్యూరో: 2027 లో జరిగే గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ (Minister Adluri Laxman Kumar) అన్నారు. పుష్కరాలకు వచ్చే భక్తుల కోసం తీసుకోవాల్సిన చర్యలపై మంగళవారం ప్రైవేట్ కన్సల్టెన్సీ ప్రతినిధులతో కలిసి గోదావరి తీరంలో మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి మాట్లాడుతూ.. 2027 లో నిర్వహించే గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందని మంత్రి తెలిపారు.

బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి తీరంలో ఆలయాల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు ఇప్పటికే ప్రభుత్వం రూ. వెయ్యి కోట్లు కేటాయించిందని మంత్రి తెలిపారు. ఇందులో జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గానికి రూ. 117 కోట్లు కేటాయించినట్లు మంత్రి వివరించారు. ధర్మపురి క్షేత్రానికి పుష్కర స్నానాలు ఆచరించే భక్తులకు ఏలాంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. పుష్కరాలకు వచ్చే భక్తుల కోసం తాగునీటి సౌకర్యం, డ్రెస్సింగ్ రూమ్స్, మరుగుదొడ్ల సౌకర్యం, పారిశుద్ధ్య పనుల నిర్వహణ కొరకు గత గోదావరి పుష్కరాలకు, కృష్ణ పుష్కరాలకు పనులు చేసిన ప్రతినిధులతో కలిసి మంగళవారం పరిశీలించినట్లు మంత్రి తెలిపారు.

మౌలిక సదుపాయాల కల్పనకు చేయాల్సిన ఏర్పాట్లపై కన్సల్టెన్సీ ప్రతినిధులు పూర్తిస్థాయి నివేదిక అందజేస్తారని మంత్రి తెలిపారు. ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం నుండి అదనపు నిధులు తీసుకువచ్చి భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించడానికి చర్యలు తీసుకుంటామని మంత్రి వివరించారు. మంత్రి వెంట జగిత్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సంగనభట్ల దినేష్ తోపాటు వేముల రాజు ధర్మపురి మున్సిపల్ వైస్ చైర్మన్ రామన్న , వార్డు కౌన్సిలర్లు చీపిరిశేట్టి రాజేష్, అయ్యోరి గోపాల్, పవన్, ప్రశాంత్, వోజ్జల లక్ష్మణ్ లతో పాటు జక్కు రవీందర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>