Mobile Popup Ad
Mobile Popup Ad

తెలంగాణలో ఐపీఎస్​ అధికారుల బదిలీలు

కలం, క్రైమ్ బ్యూరో : రాష్ట్రంలో ప్రభుత్వం మరోసారి ఐపీఎస్‎లను బదిలీ (IPS Transfers) చేసింది. 12 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది ప్రభుత్వం. ఈ మేరకు సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీచేశారు. రామగుండం పోలీసు కమిషనర్ అంబర్ కిషోర్ ఝాకు తన ప్రస్తుత బాధ్యతలతో పాటు డీఐజీ, జోన్-1 (కాళేశ్వరం) అదనపు బాధ్యతలు అప్పగించారు.

హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ డా. జోయెల్ డేవిస్‎కు డీఐజీ, జోన్-5 (యాదాద్రి) అదనపు బాధ్యతలు కేటాయించారు. వరంగల్ పోలీసు కమిషనర్ సన్ ప్రీత్ సింగ్‎కు సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్‎గా బదిలీ చేయడంతో పాటు డీఐజీ, జోన్-3 (రాజన్న సిరిసిల్ల) అదనపు బాధ్యతలు అప్పగించారు. హైదరాబాద్ ఉత్తర మండలం (లా అండ్ ఆర్డర్) జాయింట్ కమిషనర్ ఎం. స్వేతను వరంగల్ పోలీసు కమిషనర్‎గా నియమించి, అదనంగా డీఐజీ, జోన్-4 (భద్రాద్రి) బాధ్యతలు అప్పగించారు. ఇంటెలిజెన్స్ విభాగం డీఐజీ (సి ఐ) ఆర్. భాస్కరన్‎ను డీఐజీ, జోన్-2 (బాసర) అదనపు బాధ్యతలు కేటాయించారు.

హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్ జాయింట్ కమిషనర్ ఎస్.ఎం. విజయ్ కుమార్‎ను హైదరాబాద్ ఉత్తర మండలం లా అండ్ ఆర్డర్ జాయింట్ కమిషనర్ అదనపు బాధ్యతలు అప్పగించారు. ఏసీబీ జాయింట్ డైరెక్టర్ సింధు శర్మను సీఐ సెల్, ఇంటెలిజెన్స్ ఎస్పీగా బదిలీ చేసి, అదనంగా ఎస్‌ఐబీ ఎస్పీ బాధ్యతలు అప్పగించారు. వై. సాయి శేఖర్‎ను సికింద్రాబాద్ రైల్వే ఎస్పీగా నియమించారు.

హైదరాబాద్ ఎస్‌ఎం & ఐటీ డీసీపీ చెర్నూరి రూపేష్ను సీఐడీ ఎస్పీగా బదిలీ చేశారు. ఏసీబీ జాయింట్ డైరెక్టర్ సి. ప్రవీణ్ కుమార్‎ను సీఐడీ ఎస్పీగా నియమించారు. పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న ఆర్. వెంకటేశ్వర్లును సీఏఆర్ హెడ్‌క్వార్టర్స్, హైదరాబాద్ డీసీపీగా నియమించారు.రాజేష్ మీనాని వనపర్తి నుంచి బదిలీ చేసి వికారాబాద్ అదనపు ఎస్పీ (అడ్మిన్)గా నియమించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>