కలం, వెబ్ డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), బ్లాక్‌బస్టర్ దర్శకుడు సుజీత్ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఓజీ’ సినిమా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. తాజాగా ‘ఓజీ 2’ (OG 2) సీక్వెల్‌ను అధికారికంగా ప్రకటించారు. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై పవన్ కళ్యాణ్ స్వయంగా ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్తుండగా, సంగీత దర్శకుడు థమన్ ఈ క్రేజీ భాగం కానున్నారు. ఈ చిత్రంలో ఓజస్ గంభీర పాత్రకు సంబంధించిన సరికొత్త కోణాలను చూపించబోతున్నట్లు మేకర్స్ హింట్ ఇవ్వడంతో అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఆసక్తికర విషయం ఏమిటంటే.. ఈ భారీ ప్రాజెక్టుపై అంచనాలు పెరుగుతున్న సమయంలో, సినిమాలోని హీరోయిన్ పాత్రపై ఫిలిం నగర్ సర్కిల్స్‌లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.
‘బుట్టబొమ్మ’ పూజా హెగ్డే (Pooja Hegde) ఈ సీక్వెల్‌లో పవన్ కళ్యాణ్ సరసన నటించబోతున్నట్లు గట్టిగా వినిపిస్తోంది. గతంలో పవన్ కళ్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’తో పాటు క్రిష్ జాగర్లమూడి ప్రాజెక్టుల్లో కూడా పూజా హెగ్డే పేర్లు పరిశీలనకు వచ్చినా డేట్స్ సర్దుబాటు కాలేదు. దీంతో ఆ కాంబినేషన్ కుదరలేదు. ఒకవేళ ఇప్పుడు ‘ఓజీ 2’ (OG 2) వార్తలు నిజమైతే.. పవన్ కళ్యాణ్-పూజా హెగ్డే జోడీ (Pooja Hegde) మొదటిసారి వెండితెరపై సందడి చేయనుంది. మరోవైపు ఈ క్రేజీ కాస్టింగ్ వార్త టాలీవుడ్‌లో హీరో, హీరోయిన్ల వయసు వ్యత్యాసం (ఏజ్ గ్యాప్) మళ్లీ తెరపైకి తెచ్చింది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం 54 ఏళ్ల వయసులో ఉండగా, పూజా హెగ్డే వయసు 35 ఏళ్లు. వీరిద్దరి మధ్య దాదాపు 19 ఏళ్ల వయసు వ్యత్యాసం ఉండటంతో టాలీవుడ్‌లో పెద్ద హీరోల పక్కన తక్కువ ఏజ్ ఉన్న హీరోయిన్స్‌ను ఎంచుకోవడంపై విమర్శలొస్తున్నాయి.
అయితే దర్శకుడు సుజీత్ ప్రస్తుతం నానితో ‘బ్లడీ రోమియో’ సినిమాను కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయన ముందుగా ఏ ప్రాజెక్టును పట్టాలెక్కిస్తారనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.
Read Also: డెలివరీ బాయ్‌పై ‘రాజు వెడ్స్ రాంబాయి’ హీరో దాడి, వీడియో వైరల్
Follow Us On : WhatsApp

