కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం అటవీ శాఖకు చెందిన పలువురు ఫారెస్ట్ సర్వీసు ( ఐఎఫ్‌ఎస్) అధికారులను బదిలీ (IFS Transfers ) చేసింది. ఈ మేరకు మొత్తం 15 మంది అధికారుల బదిలీలు, పోస్టింగ్ లకు సంబంధించిన ఉత్తర్వులను తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని ఆదేశాలు జారీ చేశారు.
ఇందులో భాగంగా భూక్య లావణ్యను హన్మకొండ & జనగామ జిల్లా నుంచి మహబూబాబాద్ జిల్లా అటవీ అధికారిగా ప్రభుత్వం నియమించింది. జి. ముకుంద్ రెడ్డిని హన్మకొండ & జనగామ జిల్లా అటవీ అధికారిగా పదోన్నతి కల్పించింది. డి. సమిత ను అటవీ సంరక్షణాధికారి (ఎఫ్‌సీఏ)గా, పీసీసీఎఫ్ కార్యాలయంలో నియమించగా.. విశాల్ బట్టుల (ఐఎఫ్‌ఎస్ 2020) ను వికారాబాద్ జిల్లా అటవీ అధికారిగా నియామకం అయ్యారు. జి.బి. రేఖా బాను దూలపల్లి తెలంగాణ ఫారెస్ట్ అకాడమీ జాయింట్ డైరెక్టర్‌గా, ఎస్. రాజశేఖర్ ను నల్గొండ జిల్లా అటవీ అధికారిగా నియామకం కాబడ్డారు. అలాగే మరికొందరు ఐఎఫ్‌ఎస్ అధికారులకు (IFS Transfers) కొత్త బాధ్యతలు అప్పగించబడ్డాయి.
Read Also: బీజేపీ అధ్యక్షుడిది బీహార్ మైండ్‌సెట్.. నితిన్ నబిన్‌పై చామల ఫైర్!
Follow Us On: Instagram

