వెల్ది మోడల్ స్కూల్ ఉపాధ్యాయుడికి అంతర్జాతీయ పురస్కారాలు

కలం, రఘునాథపల్లి : జనగామ జిల్లా రఘునాథపల్లి (Raghunathpalli) మండలంలోని వెల్ది తెలంగాణ మోడల్ స్కూల్ (Veldi Model School), ఆంగ్ల ఉపాధ్యాయుడు కందగట్ల గణేష్ అంతర్జాతీయ స్థాయిలో రెండు ప్రతిష్ఠాత్మక గౌరవ పురస్కారాలను దక్కాయి. దక్షిణాఫ్రికాకు చెందిన గ్లోబల్ రాయల్ కింగ్‌డమ్ – పిలర్స్ ఆఫ్ పీస్ ఇంటర్నేషనల్ సంస్థ ప్రపంచ శాంతి, మానవతా విలువలు, కుటుంబ వ్యవస్థ బలోపేతానికి చేసిన విశిష్ట సేవలను గుర్తించి గణేష్‌కు గౌరవ ప్రశంసా పత్రాన్ని ప్రదానం చేసింది.

అదేవిధంగా నైజీరియాకు చెందిన అంతర్జాతీయ విద్యా సంస్థ ఎ వాక్ త్రూ ఎడ్యుకేషన్ – గ్లోబల్ ఇంటెలెక్చువల్ ఎక్స్ఛేంజ్ విద్యారంగంలో ఆయన చూపిన నిరంతర కృషి, విశిష్ట ప్రతిభ, అంకితభావాన్ని గుర్తించి త్రైమాసిక అత్యుత్తమ ప్రతిభా పురస్కారాన్ని బహూకరించింది. ప్రపంచ విద్యా సమాజంలో ఆయన అందించిన సేవలకు ఈ పురస్కారం ప్రత్యేక గుర్తింపుగా నిలిచింది. ఈ సందర్భంగా వెల్ది తెలంగాణ మోడల్ స్కూల్ (Veldi Model School), ప్రిన్సిపాల్ పాలకుర్తి శ్రీధర్.. కందగట్ల గణేష్‌ను అభినందించారు.

అంతర్జాతీయ వేదికలపై పాఠశాలకు కీర్తి ప్రతిష్ఠలు తీసుకురావడం ప్రతి ఉపాధ్యాయునికి స్ఫూర్తిదాయకమని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ఇదే సేవా స్పూర్తితో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ మరిన్ని జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలను అందుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు జయశ్రీ, గాజర్ల రుద్రమదేవి, పార్వతి, సౌజన్యప్రియ, కట్ట రాజు, షహానా సుల్తానా, దారం శ్రీను, వినీల, తుమ్మ రవి, శశికుమారి, మాలతి, వసంత మాధురి, తదితరులు పాల్గొన్నారు.

Read Also: పవన్ కళ్యాణ్‌తో పూజా హెగ్డే రొమాన్స్? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్‌పై రచ్చ!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>