Mobile Popup Ad
Mobile Popup Ad

డివైన్ వార్ టచ్‌తో ఎన్టీఆర్–త్రివిక్రమ్ మూవీ పోస్టర్ వైరల్

కలం, సినిమా : మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ (NTR – Trivikram) కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ మాసివ్ కాంబో మూవీ నుంచి అదిరిపోయే అప్‌డేట్ వచ్చింది. ఫ్యాన్స్‌ని సర్‌ప్రైజ్ చేస్తూ ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో కనిపించే త్రిశూలం, దానిలోనుంచి వెలువడుతున్న డిఎన్ఎ హెలిక్స్ ఆకృతి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

అలాగే  “One Spear. One Purpose. One Divine Reckoning” అనే ట్యాగ్‌లైన్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. పోస్టర్‌లో సంస్కృత శ్లోకం కూడా ఉండటంతో ఈ చిత్రం పురాణ, ఆధ్యాత్మిక అంశాలతో కూడిన భారీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్నట్లు తెలుస్తుంది. ఈ చిత్రాన్ని ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తుండగా, హారిక & హాసిని క్రియేషన్స్, నందమూరి తారక రామారావు ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ (NTR – Trivikram) విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Read Also: ఫోన్‌లో ఈ మార్పులు కనిపిస్తున్నాయా? అయితే మీ ఫోన్ హ్యాక్ అయినట్లే!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>