Mobile Popup Ad
Mobile Popup Ad

ఫోన్‌లో ఈ మార్పులు కనిపిస్తున్నాయా? అయితే మీ ఫోన్ హ్యాక్ అయినట్లే!

కలం, వెబ్‌డెస్క్: ఈ రోజుల్లో స్మార్ట్‌‌ఫోన్ మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారిపోయింది. ఉదయం పెట్టుకునే అలారం మొదలు ఆర్థిక లావా దేవీల వరకు ఎన్నో కార్యకలాపాలు ఫోన్‌లోనే జరుగుతున్నాయి. ఈ క్రమంలో సైబర్ దాడులు పెరిగిపోతున్నాయి. సైబర్ నేరగాళ్లు స్మార్ట్ ఫోన్‌లను హ్యాక్ (Phone Hacked) చేసి సైబర్ దాడులకు పాల్పడుతున్నారు. ఈ తరుణంలో మన ఫోన్ సేఫ్ గా ఉందా లేదా హ్యాక్ అయిందా అనే డౌట్ చాలా మందికి వస్తుంది. అయితే ఫోన్ హ్యాక్ అయినప్పుడు ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాన్ని వివరించారు టెక్ నిపుణులు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఫోన్ హ్యాక్ అయిందని తెలిపే సంకేతాలు

ఫోన్ వేడెక్కడం, బ్యాటరీ డ్రైన్: సాధారణంగా ఫోన్ ఎక్కువ సేపు వాడినా, గేమ్స్ ఆడినా వేడేక్కడం సహజం. కానీ మీరు ఫోన్ వాడకపోయినా, గేమ్స్ ఆడకపోయినా ఫోన్ వేడెక్కుతుంటే జాగ్రత్త పడాలని సూచిస్తున్నారు. బ్యాక్‌గ్రౌండ్‌లో ఏదైనా స్పైవేర్ రన్ అయినప్పుడు ఇలా హఠాత్తుగా ఫోన్ వేడెక్కుతుందని చెబుతున్నారు నిపుణులు. అయితే డేటాను వేరే సర్వర్‌కు పంపడం వల్ల బ్యాటరీ చాలా వేగంగా అయిపోతుందని చెబుతున్నారు.

డేటా యూసెజ్ చేంజెస్: మనం రోజంతా ఇంటర్నెట్ వాడకపోయినా, మొబైట్ డేటా లిమిట్ అయిపోవడం. ఈ సంకేతం హ్యాకర్లు మీ ఫోన్ డేటాను దొంగిలించేందుకు ప్రయత్నిస్తున్నారని అర్థం.

వింత శబ్దాలు & ప్రమేయం లేని మెసేజ్‌లు: ఫోన్ మాట్లాడుతున్నప్పుడు మధ్యమధ్యలో క్లిక్ లేదా మరేదైనా వింత శబ్దం వినిపించడం. ఇది మీ కాల్స్ రికార్డ్ అవుతున్నట్లు తెలిపే సూచన. అలాగే మీ ప్రమేయం లేకుండానే ఇతరులకు వింత లింకులు, మెసేజ్‌‌లు వెళ్లడం.

ఫోన్ పనితీరు మందగించడం: ఫోన్‌లో ఏదైనా యాప్‌ ఓపెన్ చేసినప్పుడు ఓపెన్ అవ్వడానికి సాధారణ సమయం కంటే ఎక్కువ సమయం తీసుకుంటే బ్యాక్ గ్రౌండ్ లో హ్యాకింగ్ మాల్వేర్ రన్ అవతుందని అర్థం కావచ్చు. అంతే కాకుండా ఫోన్ వాడకపోయినా స్క్రీన్ ఆటోమేటిక్ గా ఆన్ అవ్వడం, దానంతట అదే రీస్టార్ట్ అవ్వడం వంటివి జరిగితే, మీ ఫోన్ రిమోట్ ద్వారా వేరొకరి నియంత్రణలోకి వెళ్లిందని చెప్పడానికి బలమైన సంకేతం.

గుర్తు తెలియని యాప్స్: మీ ఫోన్ యాప్ లిస్టులో మీరు ఇన్‌స్టాల్ చేయని యాప్‌లు కనిపిస్తే నిర్లక్ష్యం చేయవద్దు. అలాంటి యాప్స్ కనిపిస్తే వెంటనే వాటిని డిలీట్ చేయాలి.

పైన తెలిపిన సంకేతాలు మీ ఫోన్‌లో కనిపిస్తే ఈ జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు నిపుణులు.

  • మీరు ఇన్‌స్టాల్ చేయని, గుర్తుతెలియని యాప్స్ కనిపిస్తే వెంటనే డిలీట్ చేయండి.
  • ఫోన్ హ్యాక్ అయినట్లు అనుమానం వస్తే వెంటనే మీ బ్యాంకింగ్ యాప్‌లు, ఈమెయిల్ ఐడీ, సోషల్ మీడియా ఖాతాల పాస్‌వర్డ్‌లను మార్చేయండి.
  • ఫోన్ సాఫ్ట్‌వేర్, సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇన్‌స్టాల్ చేయండి.
  • ఇవన్నీ చేసిన తర్వాత కూడా అవే సంకేతాలు కనిపిస్తే మీ కీలక డేటాను బ్యాకప్ తీసుకోండి. తర్వాత ఫోన్‌ను ‘ఫ్యాక్టరీ రీసెట్’ చేయడం ఉత్తమమైన పరిష్కారం అని చెబుతున్నారు టెక్ నిపుణులు.
మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>