కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఎన్నికలలో జనసేన (Janasena) పార్టీ సరికొత్త వ్యూహాలతో ముందుకెళ్తుందని.. ఎమ్మెల్సీ నాగబాబు (MLC Naga Babu) వెల్లడించారు. అరకు పార్లమెంట్ నియోజకవర్గం పార్టీకి ఎంతో కీలకమని.. అరకు నియోజకవర్గ పరిధిలోని అన్ని స్థానాలలో జనసేన పోటీ చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధి, సంక్షేమమే పార్టీ ప్రధాన లక్ష్యమని తెలిపారు.
గిరిజనుల హక్కుల పరిరక్షణకు జనసేన పూర్తిగా కట్టుబడి ఉందని నాగబాబు (Naga Babu) పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ పంచాయతీరాజ్ శాఖను తీసుకోవడం కూడా గిరిజన సంక్షేమం కోసమేనని వివరించారు. బాక్సైట్, హైడ్రోపవర్ ప్రాజెక్టులపై తనకు పూర్తిగా అవగాహన లేకపోయినా.. ప్రకృతికి హాని కలిగించే ఏ నిర్ణయాన్నీ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆమోదించరని నాగబాబు స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారాయి.
Read Also: ప్రభుత్వ సేవలు మరింత సులువు.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
Follow Us On: Instagram

