కలం, వెబ్ డెస్క్ : మనుషులైనా.. జంతువులైనా తమ బిడ్డల పాలిట తల్లిదండ్రులకు ఉన్న ప్రేమ వర్ణించలేనిది. పిల్లల కోసం వారు ఎన్నో త్యాగాలు చేస్తూ, కష్టాలను ఓర్చుకుంటూ తమ సంతానాన్ని అల్లారుముద్దుగా పెంచుకుంటారు. గారాబం చేస్తూ ముద్దుల వర్షం కురుపిస్తారు. జంతువులు కూడా ఇదే విధంగా వాటి సంతానాన్ని ముద్దులాడుతాయి. ఇలాంటి అందమైన దృశ్యాలు (Cute Animal Moments) కెన్యాలోని మాసై మారా అడవిలో కెమెరామెన్ కు చిక్కాయి.
రెండు సింహాలు తమ పిల్లను నాకుతూ చాలా ప్రేమగా కనిపించాయి. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సింబాకు వాటి తల్లిదండ్రులు చూపిస్తున్న ప్రేమ క్షణాలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ప్రకృతి అంటేనే ప్రేమకు స్వరూపంగా ఈ ఫోటోలు ఉన్నాయని కామెంట్స్ చేస్తున్నారు. ఎంతటి క్రూరమైన జంతువులు అయిన వాటి పిల్లల విషయంలో మాత్రం సాధారణమే అనేలా ఈ ఫోటోలు నిరూపిస్తున్నాయి.

