Mobile Popup Ad
Mobile Popup Ad

బీఎల్వోలు బాధ్యతాయుతంగా పనిచేయాలి: కలెక్టర్ ఆదర్శ్ సురభి

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) ప్రక్రియలో ప్రతి బీఎల్వో బాధ్యతాయుతంగా వ్యవహరించి, ప్రజలకు ఎన్యూమరేషన్ ఫారాల నింపే విధానంపై పూర్తి అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి (Collector Adarsh Surabhi) సూచించారు. సోమవారం వనపర్తిలోని 23వ వార్డులో సర్ ప్రక్రియలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ ప్రక్రియను జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించారు.

ఈ సందర్భంగా బూత్ లెవల్ అధికారుల (బీఎల్వోలు) పనితీరును కలెక్టర్ పరిశీలించారు. ప్రతి ఇంటికి వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలను అందజేయడంతోపాటు, ఓటర్లకు ఫారాలను ఎలా సక్రమంగా పూరించాలో స్పష్టంగా వివరించాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి సందేహాలు ఉన్నా ఓర్పుతో నివృత్తి చేసి, అవసరమైన పత్రాలపై అవగాహన కల్పించాలని ఆదేశించారు.

అలాగే, ఎన్యూమరేషన్ ప్రక్రియను పారదర్శకంగా, నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని, అర్హులైన ప్రతి ఓటరుకు ఫారం అందేలా చర్యలు తీసుకోవాలని బీఎల్వోలకు సూచించారు. ఓటరు జాబితా ఖచ్చితత్వానికి ఈ ప్రత్యేక సవరణ ప్రక్రియ ఎంతో కీలకమని, అధికారులు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని కలెక్టర్ (Adarsh Surabhi) తెలిపారు. ఆర్డీవో సుబ్రహ్మణ్యం, తహసిల్దార్ రమేష్ రెడ్డి, బీఎల్వోలు, ఇతర అధికారులు, తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.

Read Also: లబ్ధిదారులకు అలర్ట్.. ‘ఇందిరమ్మ ఇండ్లు’కు కొత్త రూల్స్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>