Mobile Popup Ad
Mobile Popup Ad

ఇంటింటి సర్వేతో పోలియో చుక్కలు

కలం, మహబూబ్ నగర్ బ్యూరో : పాతపాలమూరు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో పల్స్ పోలియో రోజున పోలియో చుక్కలు వేయని పిల్లలకు జిల్లా (Mahabubnagar) కలెక్టర్ ఖుష్బూ గుప్తా గుప్తా సోమవారం ఇంటింటి సర్వే ద్వారా పోలియో డ్రాప్స్​ వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఇంటింటి సర్వే చేసి 0-5 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలకు పోలియో చుక్కలు వేయాలని అధికారులను ఆదేశించారు.
కలెక్టర్​ వెంట ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ సాయి శివాని,జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డా. ఏ.శ్రీనివాసులు జిల్లా ఇమ్మ్యూననైజేషన్ అధికారి డా.శైలజ, స్టేట్ కన్సల్టెంట్ డా. మొహమ్మద్ అబ్దుల్ వస్సే, వైద్య సిబ్బంది ఉన్నారు.

Read Also: అమ్రాబాద్ అడవుల్లో అరుదైన అతిథి!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>