భద్రాచలం శివారులో గంజాయి రవాణా భగ్నం

​కలం, ఖమ్మం బ్యూరో : భద్రాచలం(Bhadrachalam) పట్టణ శివారులో అబ్కారీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌  పోలీసులు(Excise Enforcement Police)  నిర్వహించిన వాహన తనిఖీలలో  భారీగా గంజాయి పట్టుబడింది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఎస్ఐ శ్రీహరి రావు తెలిపిన వివరాల ప్రకారం, కూనవరం రోడ్ ఇసుక ర్యాంపు సమీపంలో పోలీసులు నిఘా ఉంచి వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఈ సమయంలో ద్విచక్ర వాహనంపై అనుమానాస్పదంగా వస్తున్న ఇద్దరు వ్యక్తులను ఆపి సోదా చేయగా, వారి వద్ద 1.3 కిలోల గంజాయి లభ్యమైంది.

విచారణలో నిందితులను రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌కు చెందిన బలరామ్ లామా, సుదీప్ కేసీలుగా గుర్తించారు. ఒడిశా నుంచి భద్రాచలం మీదుగా హైదరాబాద్‌కు గంజాయి అక్రమంగా తరలిస్తుండగా వీరు పట్టుబడినట్లు పోలీసులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.1.70 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. నిందితులను అదుపులోకి తీసుకుని.. గంజాయి , ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>