కలం, కరీంనగర్ బ్యూరో: సుప్రీం కోర్టు తీర్పు మేరకు ఓటర్ జాబితాపై దేశావ్యాప్తంగా జరుగుతున్న ప్రత్యేకమైన సమగ్ర సవరణ (SIR)లో భాగంగా మానకొండూర్ (Manakondur) నియోజకవర్గంలో ఇంటింటికి జరుగుతున్న సర్వేపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని సర్ సర్వే మానకొండూర్ నియోజకవర్గ బీఎల్ఏ, బీజేపీ (BJP) రాష్ట్ర నాయకులు ఇనుకొండ నాగేశ్వర్ రెడ్డి అన్నారు. ఆదివారం తిమ్మాపూర్ మండలం రామక్రిష్ణకాలనీ గ్రామంలో జరుగుతున్న సర్ సర్వే కార్యక్రమంలో భాగంగా ఆయన పాల్గొన్నారు. సర్ సర్వే ప్రక్రియలో భాగంగా ఓట్లు తొలగించబడతాయని కొన్నిచోట్ల కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తలు అంటున్నారని అన్నారు. కేవలం వారి అవగాహనా రాహిత్యం వల్లనే ఇలాంటి ప్రచారాన్ని చేస్తున్నారని అన్నారు.
ఈ సందర్బంగా గ్రామంలోని ఓటర్ ఇంటికి వెళ్లి ఓటు మ్యాపింగ్ తో పాటుగా జరుగుతున్న ప్రక్రియను తెలుసుకున్నారు. ప్రతీ బూత్ ల వారిగా నియమించిన బీఎల్ఏ-2లు బీఎల్ఓలకు అందుబాటులో ఉండాలని సూచించారు. చనిపోయిన వారి ఓట్లు, నకిలీ ఓట్లపై ప్రత్యేక శ్రద్ద వహించాలని పేర్కొన్నారు. ఎస్ఐఆర్ పై అలసత్వం వహించినట్లు తెలిస్తే జిల్లా పార్టీ ఆధ్వర్యంలో కలెక్టర్ కు పిర్యాదు చేస్తామని అన్నారు.
ఓటు సవరణ చేసుకున్న ఓటర్లకు, సర్వే లో పాల్గొని బీఎల్ఓలకు సహకరిస్తున్న బీజేపీ కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఎల్ఓ గంగు మల్లేశం, మండల బీజేపీ మాజీ అధ్యక్షులు, శక్తి కేంద్ర ఇంచార్జి సుగుర్తి జగదీశ్వరాచారి, సీనియర్ నాయకులు వేల్పుల ఓదయ్య, బూత్ అధ్యక్షులు కోతి రాజు, రేగూరి సుగుణాకర్, సోన్నాకుల రాజు, బీఎల్ఏ-2 సిద్ధ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.

