Mobile Popup Ad
Mobile Popup Ad

ఎవరైనా అడ్డొస్తే తొక్కుతా : సీఎం రేవంత్

కలం, వెబ్ డెస్క్ : ‘మూసీ ప్రక్షాళనకు ఎవరైనా అడ్డం పడితే తొక్కుతా కానీ.. మూసీ పనులు ఆపను’ అని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తెలిపారు. నల్గొండ ప్రభుత్వ కాలేజీ గ్రౌండ్ లో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. హైదరాబాద్ కు ఎవరు వచ్చినా మూసీని చూసేలా తీర్చిదిద్దతానని తెలిపారు.

తన జీవిత లక్ష్యం మూసీ ప్రాజెక్టును పూర్తి చేయడమేనని సీఎం స్పష్టం చేశారు. దేశానికి తలమానికంగా మూసీ ప్రక్షాళన చేసి చూపిస్తామని.. ఒట్టేసి చెబుతున్నా ప్రక్షాళన పనులు ఆపను అని తేల్చి చెప్పారు. 2034 వరకు మూడు రంగుల జెండా ఎగురుతుందని రేవంత్ ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ తినే సన్న బియ్యమే పేదలకు అందజేస్తున్నామని గుర్తు చేశారు.

సన్న బియ్యం పంపిణిపై అనుమానం ఉంటే తండాలకు వెళ్లి చూడాలన్నారు. అసెంబ్లీకి వస్తే ఉద్యోగాల భర్తీపై పూర్తి వివరాలు ఇస్తామని చెప్పారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలన.. కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధిపై సిద్ధమా? అని సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతలకు సవాల్ విసిరారు.

 

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>