కలం, వెబ్ డెస్క్: కరాచీ పేలుళ్ల వెనుక భారత్ (India) హస్తం ఉందన్న పాకిస్థాన్ ఆరోపణలకు భారత్ గట్టి కౌంటర్ ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ ప్రకటన విడుదల చేశారు. ‘పాక్ ఆరోపణలను పూర్తిగా తిరస్కరిస్తున్నాం. కరాచీ పేలుళ్లతో భారత్ కు ఎలాంటి సంబంధం లేదు. పాకిస్థాన్ మా వైపు వేళ్లు చూపించే ముందు, సొంత గడ్డపై క్యాంపులు పెట్టుకున్న ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవాలి. పాక్ సంపూర్ణంగా ఉగ్రవాదంపైనే ఆధారపడిందని, దాన్ని జాతీయ విధానంగా మార్చుకుంది’ అని మండిపడ్డారు.
పంజా విసిరిన తాలిబన్లు..
కరాచీలో నిన్న రాత్రి గులిస్థాన్-ఇ-జౌహర్ ప్రాంతంలోని సింధ్ రేంజర్స్ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడిలో ముగ్గురు పాక్ రేంజర్లు చనిపోయారు. అనేక మంది గాయపడ్డారు. తాలిబన్లకు చెందిన జమాత్-ఉల్-అహ్రార్ సంస్థ దీనికి ప్రాథమిక బాధ్యత వహించినట్లు తెలుస్తోంది. ఆఫ్గనిస్థాన్‌తో ఘర్షణ వేళ.. ఇటీవల కాలంలో పాక్ సైనిక కార్యాలయాలనే తాలిబన్లు లక్ష్యంగా చేసుకోవడం గమనార్హం.

