కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు (PV Narasimha Rao) జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్, మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్, అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్ లతోపాటు పలువురు నాయకులు, కార్యకర్తలు, పీవీ నరసింహారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, వైద్యుల అంజన్ కుమార్, ఆరేపల్లి మోహన్ మాట్లాడుతూ.. తెలంగాణ ముద్దు బిడ్డ అయిన పీవీ నరసింహారావు బహుభాషా కోవిదుడు, ఆర్థిక సంస్కరణ కర్త అని కొనియాడారు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో నరసింహరావు చిత్ర పటానికి నివాళులు అర్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా దేశవ్యాప్తంగా ఆర్థిక సంస్కరణలకు రూపు తీసుకువచ్చి, దేశాన్ని ఆర్థికంగా ముందంజలో నిలిపిన వ్యక్తి పీవీ నరసింహరావు అని అన్నారు. వారి ఆశయ సాధన కోసం, వారు చూపిన బాటలో, వారి అడుగుజాడల్లో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెన్న రాజమల్లయ్య, గుండాటి శ్రీనివాస్ రెడ్డి, ఆకుల ఉదయ్, వంగల విద్యాసాగర్, శుకూర్, నాగుల సతీష్, కుంభాల రాజ్ కుమార్, మాదాసు శ్రీనివాస్, సుదర్శన్, మాలోతు మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

