Mobile Popup Ad
Mobile Popup Ad

హ్యామ్ రోడ్లకు శ్రీకారం చుట్టిన సీఎం రేవంత్ రెడ్డి

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణలో హైబ్రీడ్ యాన్యునిటీ మోడ్ (హ్యామ్) విధానంలో చేపట్టబోయే పనులకు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆదివారం శ్రీకారం చుట్టారు. నల్గొండలో పర్యటించిన రేవంత్ కనగల్ లో ఏర్పాటు చేసిన హ్యామ్ రోడ్ల (HAM Roads) పైలాన్ ను ఆవిష్కరించారు.

అనంతరం రూ.13,006 కోట్లతో 441 రోడ్ల నిర్మాణం, విస్తరణతో పాటు.. రూ.83 కోట్లతో చేపట్టబోయే తాగునీటి పథకానికి సైతం సీఎం రేవంత్ శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలోని రోడ్లను అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం ఈ మేరకు హ్యామ్ రహదారుల పనులను ప్రారంభించింది. సాధారణ విధానంలో కాకుండా హ్యామ్ (హైబ్రీడ్ యాన్యునిట్ మోడ్) లో నిర్మించేందుకు ప్రభుత్వం ప్రణాళిక రచించింది.

ఈ రహదారుల నిర్మాణం, నిర్మహణను 15 సంవత్సరాల పాటు కాంట్రాక్టర్లే నిర్వహించే విధంగా ఆర్ అండ్ బీలో ప్రత్యేకంగా హ్యామ్ పేరుతో ఓ విభాగాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో హ్యామ్ రోడ్ల అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. అలాగే, ఎన్ జీ కళాశాల మైదానంలో జరిగే భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>