Mobile Popup Ad
Mobile Popup Ad

త్వరలో అనిరుధ్-కావ్యా వివాహం.. క్లారిటీ ఇచ్చిన నటుడు!

కలం, వెబ్ డెస్క్ : స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) అధినేత కావ్యా మారన్ (Anirudh-Kavya) త్వరలోనే వివాహ బంధంతో ఒకటి కాబోతున్నారనే వార్త ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. గత కొంతకాలంగా వీరిద్దరి రిలేషన్‌షిప్‌పై సామాజిక మాధ్యమాల్లో రకరకాల ప్రచారాలు జరుగుతుండగా, తాజాగా ప్రముఖ సీనియర్ నటుడు వైజీ మహేంద్రన్ చేసిన వ్యాఖ్యలు ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చాయి.

అనిరుధ్‌కు వరుసకు పెద్దనాన్న అయ్యే వైజీ మహేంద్రన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వీరిద్దరి వివాహంపై కీలక వ్యాఖ్యలు చేశారు. అనిరుధ్, కావ్య త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని ఆయన ధృవీకరించినట్లు తెలుస్తోంది. ఒక ప్రముఖ కుటుంబానికి చెందిన నటుడే స్వయంగా ఈ విషయాన్ని ప్రస్తావించడంతో కోలీవుడ్, టాలీవుడ్‌తో పాటు ఐపీఎల్ వర్గాల్లోనూ ఈ పెళ్లి ముచ్చట హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఈ వ్యవహారంపై అటు అనిరుధ్ కుటుంబం కానీ, ఇటు మారన్ కుటుంబం కానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>