కలం, వరంగల్ బ్యూరో : హన్మకొండలోని కాకతీయ విశ్వవిద్యాలయం (Kakatiya University) హాస్టల్ మెస్‌లో ఆహార నాణ్యత మళ్లీ వివాదాస్పదమైంది. వర్సిటీ మెస్‌లో విద్యార్థులకు వడ్డించిన ఉప్మాలో పురుగులు దర్శనమివ్వడంతో విద్యార్థులు దిగ్భ్రాంతికి గురయ్యారు. హాస్టల్స్ లో పారిశుధ్య లోపం, నాసిరకం భోజనంపై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కనీస పట్టించుకునే నాథుడే కరువయ్యాడని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దీనికి తోడు యూనివర్సిటీ (Kakatiya University) మెస్‌లో మరో ప్రధాన సమస్య కూడా వెలుగుచూసింది. హాస్టల్‌లో ఉండే అర్హులైన విద్యార్థుల (బార్డర్స్) కోసం కేటాయించిన భోజనాన్ని, నాన్ బార్డర్స్ వచ్చి ఇష్టారాజ్యంగా తింటున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. దీనివల్ల ప్రతిరోజూ సకాలంలో భోజనం అందక, వండిన ఆహారం సరిపోక క్యాంపస్ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి మెస్ లలో భద్రతను, పర్యవేక్షణను పెంచాలని, విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించేలా చర్యలు తీసుకోవాలని కేయూ విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.
Read Also: ప్రతిరోజు గుడ్డు తింటున్నారా.. శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
Follow Us On: Instagram

