ధర్మసాగర్ ఇన్‌స్పెక్టర్‌పై విచారణ.. ఏఆర్‌కు అటాచ్

కలం, హనుమకొండ : వరంగల్ (Warangal) కమిషనరేట్ పరిధిలోని ధర్మసాగర్ (Dharmasagar) పోలీస్ ఇన్‌స్పెక్టర్ శ్రీధర్ రావును ఏఆర్ (Armed Reserve) కు అటాచ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ (Sunpreet Singh) ఉత్తర్వులు జారీ చేశారు. ఇన్‌స్పెక్టర్ శ్రీధర్ రావుపై పలు ఆరోపణలు రావడంతో వాటిపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఆదేశించిన కమిషనర్, విచారణ పూర్తయ్యే వరకు ఆయనను ఏఆర్‌కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విచారణ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆరోపణలపై విచారణ కొనసాగుతోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>