Mobile Popup Ad
Mobile Popup Ad

కరీంనగర్‌లో SIRపై అవగాహన

కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) నగర పాలక సంస్థ 50వ డివిజన్ పరిధిలోని పోలింగ్ బూత్ నంబర్ 170లో సర్ (SIR Voter Awareness) ప్రక్రియపై ప్రజలకు, ఓటర్లకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ బోయినపల్లి ప్రవీణ్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని సర్ ఆవశ్యకతను, దాని ప్రయోజనాలను ప్రజలకు వివరంగా తెలియజేశారు. సర్ పై అవగాహన, ఎన్యుమరేషన్ ఫామ్స్ పంపిణీ కార్యక్రమం డివిజన్ వ్యాప్తంగా జరుగుతుందని.. డివిజన్ ప్రజలు ఎలాంటి అపోహలు ఆందోళనకు గురికావద్దని తెలిపారు.

డివిజన్ ప్రజలకు ఓటుకు సంబంధించిన విషయంలో సమస్యలు తలెత్తుతే తనను సంప్రదించవచ్చని అన్నారు. 170 పోలింగ్ బూత్ లో బూత్ లెవల్ అధికారులు (BLO) అనిత, వెంకటస్వామి, రాజేందర్ రావులతో కలిసి కార్పొరేటర్ ప్రవీణ్ రావు ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేస్తూ సర్ ఎన్యుమరేషన్ ఫామ్స్ పంపిణీ చేశారు. ఈ ప్రక్రియలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని వారు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>