కలం, ఖమ్మం బ్యూరో : దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధి చెందిన భద్రాచలం (Bhadrachalam) పుణ్యక్షేత్రాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కంకణం కట్టుకుందని స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు (Tellam Venkata Rao) తెలిపారు. శనివారం జిల్లా కలెక్టర్ అంకిత్‌తో కలిసి ఆలయ పరిధిలో పలు అభివృద్ధి పనులను అధికారికంగా ప్రారంభించారు. రానున్న పుష్కరాల నాటికి భద్రాచలం ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది భక్తులకు అంకితం చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
రాముడి పాదధూళితో పునీతమైన భద్రాద్రి క్షేత్రాన్ని దేశంలోనే ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే (Tellam Venkata Rao) తెలిపారు. పుష్కరాల సమయానికి అన్ని పనులు వంద శాతం పూర్తిచేయాలని.. అధికారులు ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అభివృద్ధి పనులు జరుగుతున్న సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని అధికారులు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. భద్రాచలం రూపురేఖలను మార్చే ఈ బృహత్తర ప్రాజెక్టుకు ప్రజలు, వ్యాపారులు, భక్తులు సహకరించాలని ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కోరారు.
Read Also: చేస్తే చాలదు.. చెప్పాలి.. ప్రచారంపై సీఎం ఫోకస్
Follow Us On: X(Twitter)

