కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: దేశంలో ఎస్టీలకు రాజకీయ సాధికారత కల్పించడంలో కాంగ్రెస్ పార్టీ చారిత్రాత్మక పాత్ర పోషించిందని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ (DCC President Sanjeev) అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాకు “ఇందిరమ్మ ఆశీర్వాద బస్ యాత్ర (Indiramma Ashirvada Bus Yatra)” చేరుకున్న సందర్భంగా నాయకులకు ఆయన ఘన స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు.
ఈ సందర్భంగా సంజీవ్ ముదిరాజ్ (DCC President Sanjeev) మాట్లాడుతూ.. ఆదివాసీల అభ్యున్నతి, సంక్షేమం (Tribal Welfare), సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. ఎస్టీలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న ఈ ఇందిరమ్మ ఆశీర్వాద బస్ యాత్ర ఆదివాసీ సమాజంలో మరింత చైతన్యాన్ని తీసుకువస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇది కాంగ్రెస్ చేపట్టిన సంకల్ప యాత్ర..
మహబూబ్‌నగర్ జిల్లా ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, ఎస్టీ సెల్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని యాత్రను విజయవంతం చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. భూత్పూర్ సభల్లో నాయకులు ఆదివాసీల అభివృద్ధి, సంక్షేమం, రాజకీయ సాధికారతపై తమ సందేశాన్ని ప్రజలకు చేరవేశారని అన్నారు. ఇందిరమ్మ ఆశీర్వాద బస్ యాత్ర.. రాష్ట్రంలో ఎస్టీల సాధికారతకు కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సంకల్ప యాత్ర అని కొనియాడారు. ఆదివాసీల అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ ప్రయాణం నిరంతరం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
ఎస్టీలకు రాజకీయాధికారం కల్పించి 50 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా తెలంగాణ ఆదివాసీ కాంగ్రెస్ కమిటీ చైర్మన్ & ఎమ్మెల్సీ శంకర్ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమనికి దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జిల్లా నాయకులు, డీసీసీ కమిటీ సభ్యులు, జిల్లా చైర్మన్లు ప్రజాప్రతినిధులు, ఎస్టీ సెల్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Read Also: చేస్తే చాలదు.. చెప్పాలి.. ప్రచారంపై సీఎం ఫోకస్
Follow Us On: X(Twitter)

