కలం, కరీంనగర్ బ్యూరో: చొప్పదండి (Choppadandi) పట్టణ సమీపంలోని కొలిమికుంట గురుకుల (Kolimikunta Gurukul) పాఠశాలలో ఎంపీసీ, బైపీసీ సెక్షన్లలో అడ్మిషన్లు వెంటనే ప్రారంభించాలని ఎంపీటీసీ ఫోరం మాజీ మండల అధ్యక్షులు, బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు సింగిరెడ్డి కృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. క్రితం సంవత్సరం కూడా హాస్టల్ వసతి లేదని అడ్మిషన్లు తీసుకోలేదన్నారు. సంవత్సరం గడిచినప్పటికి వసతి ఏర్పాటు చేయడంపై కానీ, నూతన అడ్మిషన్లపై కానీ దృష్టి సారించిన నాథుడు లేడని ఆయన వాపోయారు.
పాలకుల నిర్లక్ష్యం వలన 160 మంది విద్యార్థులు చదువుకునే అవకాశం కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ సత్వరం స్పందించి గురుకుల పాఠశాలలో ఇంటర్ సైన్స్ విభాగం అడ్మిషన్లు ప్రారంభించాలని సింగిరెడ్డి కృష్ణారెడ్డితోపాటు బీజేపీ మండల శాఖ అధ్యక్షులు మొగిలి మహేష్, దొంతిసారపు సంపత్‌లు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఈ గురుకుల (Kolimikunta Gurukul) స్కూల్ లో హాస్టల్ వసతి లేదనే కారణంతో ఎంపీసీ, బైపీసీ సెక్షన్లలో అడ్మిషన్లు నిలుపుదల చేసిన విషయం తెలిసిందే.
Read Also: చేస్తే చాలదు.. చెప్పాలి.. ప్రచారంపై సీఎం ఫోకస్
Follow Us On: Instagram

