Mobile Popup Ad
Mobile Popup Ad

నిర్మల్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగ అవకాశాలు

కలం, నిర్మల్ : జాతీయ క్షయ వ్యాధి నిర్మూలన కార్యక్రమం (NTEP) కింద ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు నిర్మల్ (Nirmal) జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాజేందర్ శనివారం తెలిపారు. మూడు ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు, రెండు సీనియర్ ట్యూబర్‌క్యులోసిస్ ల్యాబొరేటరీ సూపర్‌వైజర్ (STLS) పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

అభ్యర్థులు తమ విద్యార్హతలకు సంబంధించిన ధృవీకరణ పత్రాలను స్వయంగా ధృవీకరించి జూలై 6, 2026న ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జిల్లా (Nirmal) వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో సమర్పించాలని తెలిపారు. దరఖాస్తు ఫారం, పూర్తి వివరాలు జిల్లా అధికారిక వెబ్‌సైట్ (https://www.nirmal.telangana.gov.in)లో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

Read Also: అలర్ట్.. ఆహార పరిశుభ్రతలో హైదరాబాద్‌కు చిట్ట చివరి స్థానం!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>