కలం, వలిగొండ: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ పకడ్బందీగా నిర్వహించాలని భువనగిరి ఎమ్మెల్యే (MLA Kumbam Anil Kumar Reddy) కుంభం అనిల్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా తన స్వగ్రామమైన వలిగొండ మండల కేంద్రంలోని తన ఇంటిలో శనివారం ఎన్యూమరేషన్ పూర్తి చేసుకున్నారు.
ఈ సందర్భంగా ఎన్నికల అధికారులకు, బూత్ లెవెల్ సిబ్బందికి తనతో పాటు కుటుంబ సభ్యుల వివరాలను అందజేసి నమోదు చేయించారు. ప్రతి అర్హత కలిగిన ఓటరు తమ వివరాలను పరిశీలించి, ఎన్యూమరేషన్ ప్రక్రియకు సహకరించాలని ఎమ్మెల్యే కుంభం ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కుంభం వెంకట్ పాపిరెడ్డి, తహశీల్దార్ దశరథ, ఎంపీడీవో జలంధర్ రెడ్డి పాల్గొన్నారు.
Read Also: అమ్రాబాద్ ఫారెస్ట్‌లో ఎన్ని పులులు ఉన్నాయంటే?
Follow Us On: X(Twitter)

