కలం, వలిగొండ: వలిగొండ (Valigonda) మండలంలోని పహిల్వాన్పూర్ గ్రామంలో పంట పొలాల మధ్య క్రషర్ మిషన్ ఏర్పాటు చేయవద్దంటూ బుధవారం రైతులు గ్రామస్తులు గ్రామపంచాయతీ వద్ద ఆందోళన చేపట్టారు. క్రషింగ్ మిషన్ ఏర్పాటుకు గ్రామపంచాయతీ అనుమతి ఇవ్వడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
గ్రామంలో ప్రజలు, రైతులు క్రషర్ మిషన్ వద్దని దీంతో పంట పొలాలు దెబ్బతింటాయని పశువులు మనుషులకు అనారోగ్య సమస్యలు ఏర్పడతాయని తెలియజేసినప్పటికీ గ్రామపంచాయతీ పాలకవర్గం ప్రజాభిప్రాయాన్ని రైతుల అభిప్రాయాన్ని పట్టించుకోకపోవడం దారుణమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎలిమినేటి జంగారెడ్డి, శ్రీశైలం రెడ్డి, రమేశ్ శ్రీనివాస్ రెడ్డి వెంకట్ రెడ్డి జంగారెడ్డి సత్తిరెడ్డి సునీత, బుచ్చిరెడ్డి, మల్లారెడ్డి కలమ్మ, విమల, పద్మ, అంజమ్మ, లక్ష్మి, దుబ్బ రమేశ్, రైతులు పాల్గొన్నారు.

