కలం, నిర్మల్: అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నిర్మల్ (Nirmal) జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో అవగాహన (Drug Awareness) కార్యక్రమం నిర్వహించారు. సారంగాపూర్ మండలం చించోలి (బి) గ్రామ శివారులోని మహాత్మ జ్యోతిబాపూలే బీసీ వెల్ఫేర్ డిగ్రీ కళాశాలలో మాదక ద్రవ్యాల నిర్మూలనపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలపై వివరించారు.
ప్రిన్సిపల్, జూనియర్ సివిల్ జడ్జి పి. రవీందర్, అదనపు ఎస్పీ ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ.. డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలు మొదట సరదాగా ప్రారంభమై, ఆ తరువాత జీవితాన్నే నాశనం చేసే స్థాయికి తీసుకువెళ్తాయని హెచ్చరించారు. విద్యార్థి దశలో స్పష్టమైన లక్ష్యంతో ముందుకు సాగాలని, డ్రగ్స్ వైపు ఆకర్షితులై తమ బంగారు భవిష్యత్తును పాడుచేసుకోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ విజయ్ కుమార్, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.

