కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలోని నాయుడువాడ కాలనీలో బీజేపీ (BJP) ఆధ్వర్యంలో హిందూ సామ్రాజ్య దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ (Chhatrapati Shivaji Maharaj) విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా.. శివాజీ మహారాజ్ హిందూ సామ్రాజ్య స్థాపన కోసం చేసిన త్యాగాలు, ఎదుర్కొన్న సవాళ్లు, కుట్రలను నాయకులు స్మరించుకున్నారు. దేశభక్తి, సంస్కృతి పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ శ్రీరామోజీ నరేష్, బీజేపీ నాయకుడు సాదం అరవింద్ తదితరులు పాల్గొన్నారు.

