కలం, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో మరో డ్రగ్స్ దందా (Drugs Racket) వెలుగు చూసింది. రాయదుర్గంలోని కో–లివ్ గార్నెట్ పీజీలో డ్రగ్స్ సరఫరా దందా జరుగుతుందన్న సమాచారంతో రాజేంద్రనగర్ ఎస్వోటీ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఎండీఎంఏ డ్రగ్‌ను సరఫరా చేస్తున్న డ్రగ్ పెడ్లర్లతోపాటు ముగ్గురు వినియోగదారులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 12 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్, 7 గ్రాముల ఓజీ కుష్ గంజాయి, ఆరు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో కో లివింగ్ కల్చర్(Co Living Culture) పెరిగిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఐటీ కారిడార్లలో కో- లివింగ్ హాస్టళ్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
కో–లివింగ్, పీజీ హాస్టళ్లను కేంద్రంగా చేసుకుని మత్తు పదార్థాల సరఫరా జరుగుతోందన్న అనుమానాలతో పోలీసులు నిఘా పెంచారు. ఈ క్రమంలోనే రాయదుర్గంలోని కో–లివ్ గార్నెట్ పీజీపై దాడులు చేసి డ్రగ్స్ దందాను (Drugs Racket) భగ్నం చేసినట్లు తెలిపారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని, డ్రగ్స్ నెట్‌వర్క్‌కు సంబంధించి మరింత సమాచారం సేకరిస్తున్నామని పోలీసులు వెల్లడించారు. నగరంలో మత్తు పదార్థాల నియంత్రణకు ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొన్నారు.
Read Also: గన్‌మెన్ చైతన్య పరిస్థితిపై హెల్త్ బులిటెన్ విడుదల
Follow Us On: Youtube


