కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావుకు అస్వస్థత

కలం, వెబ్ డెస్క్: కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రభుత్వ సలహాదారు వి.హనుమంతరావు (V Hanumantha Rao) అస్వస్థతకు గురయ్యారు. మూత్ర పిండాల సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయన.. శుక్రవారం అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. దీంతో కుటుంబసభ్యులు, సిబ్బంది ఖైరతాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించినట్లు సమాచారం. హనుమంతరావు ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. గతంలో రాజ్యసభ ఎంపీగా పనిచేసిన హనుమంతరావును ఇటీవలే ప్రభుత్వం బీసీ సంక్షేమ, అభివృద్ధి శాఖ సలహాదారుగా కేబినెట్ హోదాలో నియమించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>