Mobile Popup Ad
Mobile Popup Ad

జీడబ్ల్యూఎంసీకి కొత్త కమిషనర్‌గా టి. వెంకన్న

కలం, వరంగల్ బ్యూరో :  రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన బదిలీ ఉత్తర్వుల మేరకు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ నూతన మున్సిపల్ కమిషనర్‌గా (GWMC Commissioner) టి. వెంకన్నను (Venkanna) నియమించింది. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA) లో కోర్ అర్బన్ రీజియన్ అండ్ మెట్రో రైల్ విభాగం జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.

ఇప్పటి వరకు జీడబ్ల్యూఎంసీ మున్సిపల్ కమిషనర్‌గా (GWMC Commissioner) అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయిని ఆ బాధ్యతల నుంచి ప్రభుత్వం రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు టి. వెంకన్న త్వరలో జీడబ్ల్యూఎంసీ మున్సిపల్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. నగర అభివృద్ధి, పారిశుధ్యం, మౌలిక వసతులు, ప్రజా సేవల మెరుగుదల వంటి అంశాలపై ఆయన ప్రత్యేక దృష్టి సారించే అవకాశం ఉందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.

Read Also: రైతులకు సోలార్ ‘పంట’.. త్వరలో పైలట్ ప్రాజెక్టు ప్రారంభం

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>