ఫారెస్ట్ ఆఫీస‌ర్స్ vs పోడు రైతులు.. ఆసిఫాబాద్‌లో హై టెన్ష‌న్‌

క‌లం, వెబ్ డెస్క్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పోడు రైతుల‌కు (Podu Farmers), ఫారెస్ట్ అధికారుల‌ (Forest Officers)కు మ‌ధ్య జ‌రిగిన వాగ్వాదంతో తీవ్ర ఉద్రిక్త‌త నెల‌కొంది. జైనూర్ మండ‌లంలోని పులస గ్రామ శివారులోని అట‌వీ భూమిని చ‌దును చేసేందుకు ఫారెస్ట్ అధికారులు శుక్ర‌వారం ఉద‌యం జేసీబీతో వ‌చ్చారు. పోడు రైతులు అధికారుల‌ను అడ్డుకున్నారు. త‌మ‌ త‌ర‌త‌రాలు ఈ భూముల‌ను సాగు చేసుకుంటున్నాయ‌ని అధికారుల‌తో వాగ్వాదానికి దిగారు. ఇప్పుడు త‌మ భూములు లాక్కుంటే తమ పిల్లలు ఎలా బ‌తుకుతార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ భూములు కోల్పోతే ఉపాధి కోల్పోయి అంతా రోడ్డు మీద ప‌డ‌తామ‌ని వేడుకున్నారు. అయినా అధికారులు వినిపించుకోక‌పోవ‌డంతో రైతులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. త‌మ‌న ప్రాణం తీసినా భూములు ఇచ్చేది లేద‌ని అధికారుల‌కు తేల్చి చెప్పారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>