కలం, వెబ్ డెస్క్: కోల్‌కతా వీధుల్లో వయోలిన్ వాయిస్తూ, ఆ మధుర స్వరాలతోనే కాలం వెళ్లదీసే భగవాన్ మల్లిక్ (Anand Mahindra) జీవితం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దశాబ్దాలుగా సాగుతున్న ఆయన సంగీత ప్రయాణం ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా దృష్టిని ఆకర్షించింది. దీంతో ఆయన కథ సరికొత్త మలుపు తిరిగింది. వృద్ధాప్యంలోనూ సంగీతంపై ఆయనకున్న అంకితభావాన్ని చూసి చలించిపోయిన మహీంద్రా.. భగవాన్ మల్లిక్ వీడియోను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. ఆయనకు ఆర్థికంగా సహాయం చేయాలనుకున్నాడు. ‘నాలాగే ఆయన ప్రతిభను చూసి చలించిపోయే ఎంతోమందితో కలిసి సహాయం చేయాలనుకుంటున్నాను. అయితే ఆయన ఎక్కడుంటారు, ఎలా సంప్రదించాలి అనే వివరాలు వీడియోలో లేవు’ అని రాసుకొచ్చారు. ఈ పోస్ట్‌కు స్పందించిన నెటిజన్లు ఆ వృద్ధ కళాకారుడి వివరాలను షేర్ చేశారు. దీంతో సహాయం చేయడానికి చాలామంది ముందుకు వస్తున్నారు.
చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన భగవాన్ మల్లిక్ (Anand Mahindra), తన తండ్రి నుంచి నేర్చుకున్న వయోలిన్‌తో జీవితాన్ని వెళ్లదీస్తున్నారు. ఆ విద్యే ఆయనకు జీవనాధారంగా మారింది. పబ్లిక్ ప్లేసుల్లో వాయిస్తూ, వచ్చే కొద్దిపాటి ఆదాయంతోనే రోజువారీ అవసరాలను తీర్చుకుంటున్నారు. వయసుపైబడటం, కంటిచూపు మందగించడం, వాయిస్తున్న వయోలిన్ కూడా పాడైపోయే స్థితికి చేరుకోవడంతో ఇబ్బందిగా మారింది. అయినా సంగీత ప్రదర్శనను ఆపలేదు. గత మే నెలలో కంటెంట్ క్రియేటర్ ఆరాధన ఛటర్జీ మొదటగా ఈ వృద్ధుడి దీనగాథను సామాజిక మాధ్యమాల్లో పంచుకోగా, ఆనంద్ మహీంద్రా చొరవతో అతని జీవితం వెలుగులోకి వచ్చింది.
I’d like to contribute, along with many others, who I know will be moved by his passion…
The video didn’t seem to provide details of how & where. https://t.co/hAkvZDbWev
— anand mahindra (@anandmahindra) June 24, 2026
Read Also: ఎల్ నినోను ఎదుర్కొందాం.. కరువును జయించే పంటలను పండిద్దాం!
Follow Us On: Instagram

