వైసీపీకి అన్నపరెడ్డి రాజీనామా.. కొత్త పార్టీలోకి చేరిక!

కలం, వెబ్ డెస్క్ : విజయవాడ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ సీనియర్ నేత అన్నపరెడ్డి విజయభాస్కర్ రెడ్డి (Annapareddy Vijayabhaskar) ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ అధినాయకత్వం తీరుపై, ముఖ్యంగా మాజీ సీఎం జగన్ వ్యవహారశైలిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పార్టీ కోసం రాత్రింబవళ్లు కష్టపడిన నాయకులకు, కార్యకర్తలకు ఎటువంటి గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

వైసీపీలో కనీసం సభ్యత్వాలు కూడా ఉండవని, సంతకాలు లేని లెటర్ ప్యాడ్‌లపై పదవులు ఇచ్చి కాలయాపన చేస్తున్నారని అన్నప్పరెడ్డి విజయభాస్కర్ రెడ్డి వ్యాఖ్యానించారు. జగన్ తనను నమ్మిన ప్రజల విశ్వాసాన్ని పూర్తిగా ఒమ్ము చేశారని విమర్శించారు. జగన్‌ను కలవాలంటే ‘కొఠారీ’ ని దాటుకుని వెళ్లాల్సిన పరిస్థితి తీసుకొచ్చారని, సజ్జల రామకృష్ణా రెడ్డి, ఆ భజన బృందమే పార్టీ నాశనానికి, నాయకులు కార్యకర్తలకు దూరం కావడానికి ప్రధాన కారణమని ఆరోపించారు.

అంతేకాదు విజయవాడలో వంగవీటి రాధాకృష్ణ గెలుపునకు, గుంటూరులో కూటమి అభ్యర్థుల విజయానికి వైసీపీలోని కొందరు సీనియర్ నేతలే వెనకుండి సహకరించారని సంచలన ఆరోపణలు చేశారు. నవంబర్ 11వ తేదీన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి విజయవాడ వేదికగా సరికొత్త రాజకీయాజెండాతో ప్రారంభించనున్న కొత్త పార్టీలో తాను చేరుతున్నట్లు అన్నపరెడ్డి విజయభాస్కర్ రెడ్డి అధికారికంగా ప్రకటించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>