ఆకట్టుకుంటున్న ‘ఇడుపు కాయితం’ ఫస్ట్ లుక్‌ !

కలం, వెబ్ డెస్క్ : వైవిధ్యభరితమైన కథలను ప్రొత్సహించడంలో ఎప్పుడూ ముందుండే సుకుమార్ రైటింగ్స్ తాజాగా మరో సినిమాకు శ్రీకారం చుట్టింది. సుకుమార్ రైటింగ్స్, బన్నీవాస్ నిర్మాణంలో ప్రియ‌ద‌ర్శి, నాగ‌దుర్గ జంటగా ‘ఇడుపు కాయితం’ (Idupu Kayitham) అనే మూవీని తీస్తుంది. వంశీ రెడ్డి దొండ‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో వస్తున్న ఈ మూవీ టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ ను నేడు రిలీజ్ చేశారు. ఈ సినిమా పూజా కార్య‌క్ర‌మాల‌కు త‌మిళ్ స్టార్ డైరెక్ట‌ర్ లోకేశ్ క‌న‌క‌రాజ్ చీఫ్ గెస్ట్‌గా హాజ‌రై ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను విడుదల చేశారు.

పోస్టర్ లో ఒక కొత్త జంట బైక్ పై ప్రయాణిస్తూ కనిపిస్తోంది. సాంప్రదాయ కట్టుబొట్టుతో, తలలో పూలు పెట్టుకున్న ఒక పల్లెటూరి యువతి, తన భర్తను హత్తుకుని నగరానికి వలస వెళ్తున్నట్లుగా ఈ పోస్టర్ ను డిజైన్ చేశారు. స్వచ్ఛమైన రూరల్ బ్యాక్‌డ్రాప్ ఎమోషనల్ అండ్ రియలిస్టిక్ గా కనిపిస్తున్న ఈ మూవీ (Idupu Kayitham) ఫస్ట్ లుక్ అడియెన్స్ ను ఆకట్టుకుంటుంది. యూట్యూబ్ ఫోక్ సాంగ్స్ లో ఫేమస్ అయిన నాగదుర్గకు ఇదే తొలి సినిమా కావడం.. ఇప్పటికే ‘బలగం’ వంటి రూరల్ బ్యాక్‌డ్రాప్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ప్రియదర్శి (Priyadarshi) అదే జోనర్ లో మళ్లీ సినిమా తీయడం ‘ఇడుపు కాయితం’ మూవీపై అంచనాలను పెంచేస్తోంది.

Read Also: అదిరిపోయే ఫీచర్లతో రోబోటాక్సీ కారు.. డ్రైవర్ లేకుండానే రయ్ రయ్!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>