కలం, వెబ్ డెస్క్: మావోయిస్టులకు (Maoist) వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఒకవైపు కూంబింగ్, మరోవైపు వరుస లోంగుబాట్లతో మావోయిస్టుల ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. సోమవారం కేంద్ర భద్రతా దళాలు, పోలీసులు మావోయిస్టుల చర్యలను భగ్నం చేశాయి. ఛత్తీస్‌గఢ్-సుక్మాలో (Chhattisgarh) మావోయిస్టుల ఆయుధ కర్మాగారం ధ్వంసం చేశాయి. భారీగా ఆయుధాలు, తయారీ సామాగ్రి, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నాయి. భద్రతా దళాలే లక్ష్యంగా బాంబుల తయారీకి సంబంధించిన సామాగ్రిని పోలీసులు పేల్చేశారు.
మావోయిస్టుల అణచివేతకు కేంద్రం ‘ఆపరేషన్ కగార్‘ (Operation Kagar)ను చేపట్టిన విషయం తెలిసిందే. 2026 మార్చి 31 నాటికి నక్సల్స్ రహితంగా దేశాన్ని మార్చేస్తామన్న కేంద్రం హోంమంత్రి అమిత్ షా ప్రకటన మేరకు కేంద్ర బలగాలు దాడులను ముమ్మరం చేస్తున్నాయి. అయితే ఒకవైపు కీలక మావోయిస్టు సభ్యులు సరెండర్ అవుతుంటే.. మరోవైపు దాడులను తప్పికొడుతూ తమ ఉనికిని చాటుకుంటున్నాయి మావోయిస్టు పార్టీలు. బీజాపూర్ ఓ కాంట్రాక్టర్ హత్యకు గురికావడం, మరో ఘటనలో భద్రతా దళాలు చనిపోవడం కేంద్రాన్ని ఉలిక్కి పడేలా చేశాయి.
Read Also: వైజాగ్‌లో అతిపెద్ద ట్రైబల్ ఈవెంట్.. విశేషాలివే!
Follow Us On: X(Twitter)


