Mobile Popup Ad
Mobile Popup Ad

బీజేపీ మాస్టర్ ప్లాన్.. ఒకే దెబ్బకు రెండు బిల్లులు!

కలం, ఢిల్లీ బ్యూరో: వచ్చే నెలలో ప్రారంభమయ్యే పార్లమెంట్ వ‌ర్షాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై బీజేపీ (BJP) పక్కా స్ట్రాటజీతో ముందుకు వెళ్తున్నది. కీలకమైన బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదించుకునేందుకు అన్ని శక్తులను కూడగట్టుకుంటున్నది. గత బడ్జెట్ సమావేశాల్లో ఎదురైన చేదు అనుభవం రిపీట్ కాకుండా జాగ్రత్త పడుతున్నది. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి డీలిమిటేషన్ (Delimitation), మహిళా రిజర్వేషన్ బిల్లు (Women Reservation Bills)లను ఆమోదించుకోవాలని.. అందుకోసం పార్లమెంట్ ఉభయ సభల్లో తగినంత సంఖ్యాబలం కోసం కొన్నిరోజులుగా స్పెషల్ ప్లాన్‌తో అడుగులు వేస్తున్నది.

మూడింట రెండొంతుల మెజారిటీ అవసరం కావడంతో.. ఆ మెజారిటీ ఫిగర్‌కు చేరువవుతున్నది. ‘వన్ షాట్ – టూ బర్డ్స్’ తరహాలో పకడ్బందీ వ్యూహాన్ని రూపొందించింది. ఒకవైపు ప్రధాన ప్రతిపక్షం పాత్రను తగ్గించడం, మరోవైపు ప్రాంతీయ పార్టీల్లో చీలికలతో రాజకీయ పరిస్థితుల్ని అనుకూలంగా మార్చుకునేలా బీజేపీ వ్యవహరిస్తున్నది. కాంగ్రెస్ నేతృత్వంలోని ‘ఇండియా’ కూటమిలో ఉన్న కొన్ని పార్టీలను సైతం ఆకర్షించేలా తెర వెనుక రాయబారాలు జోరుగా నడుస్తున్నాయి.

ముగ్గురు కీలక నేతలకు బాధ్యతలు

కాంగ్రెస్‌తో ఇంతకాలం దగ్గరగా ఉండి ఇటీవల దూరమైన పార్టీలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. ఏ కూటమితోనూ సంబంధం లేకుండా విడిగా ఉన్న పార్టీలతోనూ సంప్రదింపులు మొదలుపెట్టింది. ఇందుకోసం ముగ్గురు నేతలకు బాధ్యతలు అప్పజెప్పినట్లు బీజేపీ కేంద్ర వర్గాలు సూచనప్రాయంగా తెలిపాయి. అన్ని పార్టీల నేతలతో సత్సంబంధాలు కొనసాగించే కిరణ్ రిజిజు, అనురాగ్ ఠాకూర్, నిషికాంత్ దూబె ఈ వ్యవహారాలను చూసుకుంటున్నారని ఆ వర్గాలు పేర్కొన్నాయి.

బిజూ జనతాదళ్, వైఎస్సార్సీపీ, డీఎంకే, బీఆర్ఎస్ సహా కొన్ని పార్టీల నేతలతో టచ్‌లో ఉన్నట్లు సమాచారం. రాజ్యసభలో మూడింట రెండొంతుల మెజారిటీ విషయంలో బీజేపీకి ఇబ్బంది లేకపోయినా.. లోక్‌సభలో జరిగే ఓటింగ్ సవాలుగా మారింది. ప్రతిపక్షాల్లోని కొందరు ఎంపీల క్రాస్ ఓటింగ్ తమకు అనుకూలంగా మారుతుందన్న ధీమా కమలనాథుల్లో వ్యక్తమవుతున్నది. మరికొన్ని పార్టీల ఎంపీలు అంశాలవారీగా మద్దతు ఇస్తారన్న నమ్మకంతో వాళ్లు ఉన్నారు.

ప్రాంతీయ పార్టీల్లో చీలికలతో..!

ప్రస్తుతం కీలకమైన బిల్లులకు పార్లమెంటు ఉభయ సభల్లో అనుకూల ఓటింగ్ కోసం మాత్రమే కాక 2029లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లోనూ కొత్త పొలిటికల్ ఈక్వేషన్స్ టార్గెట్‌గా ఇప్పటి నుంచే బీజేపీలో కసరత్తు చేస్తున్నది. ప్రతిపక్ష శిబిరంలో చోటుచేసుకుంటున్న పరిణామాలను అనుకూలంగా మలుచుకోవాలనేందుకు ప్రయత్నిస్తున్నది. ఇందుకు తమిళనాడులో కాంగ్రెస్-డీఎంకే మధ్య బెడిసికొట్టిన దీర్ఘకాల బంధాన్ని బీజేపీ వర్గాలు ఉదహరిస్తున్నాయి.

ఆ కూటమిలోని లుకలుకలతో కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా బలహీనపడుతుందని, ఒంటరి అవుతుందనే ధీమా బీజేపీలో ఉన్నప్పటికీ.. తన వంతు ప్రయత్నాలతో మరింత తీవ్రం చేయాలనుకుంటున్నది. కాంగ్రెస్ కూటమి బలాన్ని క్రమంగా తగ్గించడం, ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్‌గాంధీ ప్రభావాన్ని పరిమితం చేయడం బీజేపీ దీర్ఘకాలిక రాజకీయ లక్ష్యం అని ఆ వర్గాలు తెలిపాయి. రానున్న రోజుల వ్యవధిలోనే ఒక ప్రాంతీయ పార్టీ బీజేపీకి దగ్గరవుతుందని పేర్కొన్నాయి.

లోక్‌స‌భ‌లో ఆ కొన్ని వస్తే సెట్!

– ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ, మహారాష్ట్రలో శివసేన (ఉద్ధవ్ వర్గం), ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం), తమిళనాడులో డీఎంకే వంటి పార్టీల్లో చీలికలు తమకు అనుకూలంగా బీజేపీ భావిస్తున్నది. ‘ఇండియా’ కూటమిలోని ప్రాంతీయ పార్టీల్లో కనిపిస్తున్న విభేదాలను రాజకీయ అవకాశంగా మల్చుకుంటున్నది.
– శివసేన, ఎన్సీపీ, ఆమ్ ఆద్మీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్.. ఇలా ఒక్కో పార్టీలో ఊహకు అందని తీరులో చీలికలు వచ్చాయి. మున్ముందు ఏ పార్టీలో ఇలాంటి చీలిక వస్తుందోననే చర్చ ఢిల్లీ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
– కీలక బిల్లుల (Delimitation – Women Reservation) ఆమోదానికి అవసరమైనంత సంఖ్యాబలం లేకపోవడంతో ప్రతిపక్ష శిబిరంలోని విభేదాలను రాజకీయంగా వినియోగించుకోవడంపై బీజేపీ దృష్టి పెట్టింది.
– రాజ్యసభలో దాదాపుగా మూడింట రెండొంతుల మెజారిటీకి తగినంత సంఖ్యాబలం అధికార ఎన్డీయే కూటమికి వచ్చేసింది.
– లోక్‌సభలో మూడింట రెండొంతుల మెజారిటీకి 362 ఓట్లు కావాలి. ఇప్పటికే ఎన్డీయేకు 319 ఎంపీలు ఉండగా.. మిగిలిన 43 మంది ఎంపీల్లో కొందరిని ఆకర్షించినా గట్టెక్కవచ్చన్నది బీజేపీ అభిప్రాయం. కొన్ని పార్టీల ఎంపీలు నేరుగా ఓటింగ్లో సపోర్ట్ ఇవ్వకపోయినా.. ఓటింగ్‌కు దూరంగా ఉంటే సరిపోతుందని బీజేపీ అంచనా వేసుకుంటున్నది. అందుకోసం ఆయా పార్టీలతో చర్చలు కూడా జరుపుతున్నట్లు తెలుస్తున్నది.
– పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జులై 21 నుంచి మొదలు కానున్నాయి. ఆలోపు సంఖ్యాబలాన్ని పెంచుకొని.. బిల్లులను టేబుల్ చేయాలని బీజేపీ చూస్తున్నది.

ఉభయ సభల్లో ఇలా..!

– రాజ్యసభలో దాదాపుగా మూడింట రెండొంతుల మెజారిటీకి తగినంత సంఖ్యాబలం అధికార ఎన్డీయే కూటమికి వచ్చేసింది.
– లోక్‌స‌భ‌లో ఫుల్ అటెండెన్స్‌తో ఓటింగ్ జరిగితే అవసరమైన 362 ఓట్లకు ఎన్డీయే వద్ద 319 మంది ఎంపీలు ఉన్నారు. మరో 43 ఓట్ల మద్దతు అవసరం.
– ఆ 43 మంది సపోర్ట్ కోసం బీజేపీ అన్ని ప్రయత్నాలు చేస్తున్నది. ప్రత్యేకంగా ముగ్గురు కీలక నేతలకు బాధ్యతలు అప్పగించింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జులై 21 నుంచి ప్రారంభం కానుండటంతో ఆలోపు అన్నీ సెట్ చేసుకోవాలని చూస్తున్నది.

Read Also:  నల్లగొండ ఫ్యామిలీ డెత్ కేసులో షాకింగ్ నిజాలు!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>