కలం వెబ్ డెస్క్ : శ్రీసత్యసాయి జిల్లా(Sri Sathya Sai District) ముత్యాలవారిపల్లిలో వైసీపీ(YCP) అధినేత వైఎస్ జగన్(YS Jagan) పుట్టినరోజు వేడుకల్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ గర్భిణీపై వైసీపీ కార్యకర్త దాడి చేయడంతో ఆమె ఆస్పత్రిపాలైంది. వైద్యులు పరీక్షించి కడుపులో బిడ్డ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వెల్లడించారు. వివరాల్లోకి వెళ్తే… ఆదివారం వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా ముత్యాలవారిపల్లిలో వైసీపీ కార్యకర్తలు వేడుకలు నిర్వహించారు.
ఈ సందర్భంగా అజయ్ అనే కార్యకర్త టపాసులు కాలుస్తున్నాడు. సంధ్యారాణి అనే గర్భిణీ తనకు ఇబ్బందిగా ఉందని, తమ ఇంటి ముందు టపాసులు కాల్చొద్దని అజయ్‌కి సూచించింది. దీంతో అజయ్ ఆవేశంతో ఆమెపై దాడి చేశాడు. ఈ ఘటనలో కిందపడి గాయపడ్డ సంధ్యారాణిని కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు కడుపులో బిడ్డలో కదలికలు లేవని చెప్పారు. పోలీసులు అజయ్‌ని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
Read Also: బాలికపై అత్యాచారం కేసులో నిందితుల అరెస్ట్
Follow Us On: X(Twitter)


