Mobile Popup Ad
Mobile Popup Ad

సాయికృష్ణది లాకప్ డెత్తే: సిట్ సంచలన రిపోర్ట్!

కలం, వెబ్ డెస్క్ : విజయవాడ సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ (SIT) దాఖలు చేసిన రిమాండ్ రిపోర్టు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఇది సాధారణ మిస్సింగ్ కేసు ఎంతమాత్రం కాదని, పోలీసుల అక్రమ నిర్బంధం వల్ల జరిగిన కస్టోడియల్ డెత్ (SaiKrishna Custodial Death) అని సిట్ కోర్టుకు సమర్పించిన నివేదికలో స్పష్టం చేసింది. అంతేకాకుండా, బాధ్యులైన పోలీసులు సాక్ష్యాలను పూర్తిగా నాశనం చేయడంతో పాటు మృతదేహాన్ని సైతం మాయం చేశారనే సంచలన నిజాలను సిట్ హైకోర్టుకు వెల్లడించింది.

ఈ కేసులో అప్పటి సీఐ నాగరాజు పాత్రపై సిట్ కీలక ఆధారాలను సేకరించింది. సాయికృష్ణను పోలీసు కస్టడీలో ఉంచినట్లు ఎక్కడా రికార్డులు లేకుండా జాగ్రత్తపడటం, సాక్ష్యాలన్నింటినీ తుడిచేయడానికి సీఐ నాగరాజే ప్రధాన కారకుడని రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. సాయికృష్ణ ప్రాణాలు కోల్పోయిన తర్వాత అతని మృతదేహాన్ని కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో స్వయంగా చూశానని ఒక సబ్ ఇన్ స్పెక్టర్ ఇచ్చిన వాగ్మూలం ఈ కేసులో బలమైన సాక్ష్యంగా మారింది.

నిజాలను నిర్భయంగా దాచిపెట్టి, హైకోర్టును సైతం తప్పుదోవ పట్టించేలా పోలీసులు తీవ్రమైన నేరానికి పాల్పడ్డారని సిట్ తన నివేదికలో ఆగ్రహం వ్యక్తం చేసింది. చట్టాన్ని రక్షించాల్సిన అధికారులే ఒక వ్యక్తిని అక్రమంగా నిర్బంధించి, ప్రాణాలు తీసి, శవాన్ని మాయం చేయడం వంటి అమానుష చర్యలకు ఒడిగట్టడం ఇప్పుడు పోలీసు శాఖలో కలకలం రేపుతోంది.

నెల్లూరు జైలుకు సీఐ నాగరాజు..

సంచలనం సృష్టించిన సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో నిందితుడిగా ఉన్న సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (CI) నాగరాజుకు కోర్టు రిమాండ్ విధించింది. ఈ కేసును విచారించిన రెండవ అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ (AJM) కోర్టు ఆయనకు 14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల అనంతరం పోలీసులు సీఐ నాగరాజును కట్టుదిట్టమైన భద్రత మధ్య నెల్లూరు కేంద్ర కారాగారానికి తరలించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>