కలం వెబ్ డెస్క్ : తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశమైన అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)లో మరో కీలక పరిణమం చోటుచేసుకుంది. మాజీ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్(Somesh Kumar)తో పాటు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్ చంద్‌లు సిట్ నోటీసులు(SIT Notices) జారీ చేసింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించింది.
సీపీ వీసీ సజ్జనార్ (VC Sajjanar) నేతృత్వంలోని సిట్ బృందం బీఆర్ఎస్(BRS) హయాంలో జరిగిన అక్రమ ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై దర్యాప్తు చేపడుతోంది. కేసులో(Phone Tapping Case) ప్రధాన నిందితుడైన ప్రభాకర్ రావు ప్రస్తుతం రెండో దఫా కస్టడీలో ఉన్నారు. డిసెంబర్ 25తో ఆయన కస్టడీ ముగుస్తుంది. ఈ తరుణంలో కేసీఆర్(KCR) ప్రభుత్వంలో పని చేసిన ఇద్దరు సీనియర్ అధికారులకు నోటీసులు రావడంతో దర్యాప్తు మరింత లోతుగా జరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. ఈ ఇద్దరి విచారణ ద్వారా సిట్ బృందం ఏయే విషయాలు రాబడుతుందన్న దానిపై ఆసక్తి నెలకొంది. ప్రభాకర్ రావు కస్టడీ ముగిసేలోపు కేసులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి రానున్నట్లు తెలుస్తోంది.
Read Also: తాగి రోడ్డెక్కుతున్నారు.. 800 మంది మందుబాబులపై కేసులు
Follow Us On: Instagram


