కలం, వెబ్ డెస్క్: పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా.. అధికారులు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నా మందుబాబుల్లో మార్పు రావడం లేదు. తాగేసి దర్జాగా డ్రైవింగ్ (Drunk and Drive) చేస్తున్నారు. రోడ్డు ప్రమాదాలకు కారణమవుతూ ఇతరుల ప్రాణాలు బలి తీసుకుంటున్నారు. హైదరాబాద్, సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వీకెండ్‌లో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో భారీగా మందుబాబులు పట్టుబడ్డారు. మద్యం తాగి వాహనం నడిపినందుకు 800 మంది వాహనదారులపై కేసులు నమోదు చేశారు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు 403 మంది డ్రైవర్లపై కేసులు నమోదు చేశారు.
వీరిలో ఎనిమిది మంది BAC స్థాయి 100 ml రక్తానికి 30 మైక్రోగ్రాముల ఆల్కహాల్ పరిమితికి ఎక్కువగా 300 కంటే ఎక్కువ ఉందని పోలీసు జాయింట్ కమిషనర్ డి. జోయెల్ డేవిస్ తెలిపారు. మద్యం సేవించి వాహనం నడపడాన్ని సహించేది లేదని హెచ్చరించారు. అలాగే సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు 409 మందిపై కేసు నమోదయ్యాయి. మియాపూర్ 81 కేసులతో అగ్రస్థానంలో ఉంది. తర్వాత చేవెళ్ల (44) శంషాబాద్ (34) ఉన్నాయి.
మద్యం తాగి పట్టుబడుతున్నవారిలో ద్విచక్ర వాహనదారులు ఎక్కువగా ఉన్నారు. మూడింట ఒక వంతు మంది 31-40 సంవత్సరాల వయస్సున్నవారు ఉన్నారు. డ్రంక్ డ్రైవ్ (Drunk and Drive) అరికట్టడానికి, రోడ్డు ప్రమాదాలను (Road Accidents) నివారించడానికి సైబరాబాద్ అంతటా డ్రైవ్‌లు కొనసాగుతాయని పోలీసులు తెలిపారు. పండుగ సీజన్, వీకెండ్‌లో తనిఖీలు ముమ్మరం చేస్తామన్నారు.
Read Also: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు
Follow Us On: X(Twitter)


