Mobile Popup Ad
Mobile Popup Ad

సీఎం విజయ్‌తో త్రిష బ్రేకప్.. ఒకే ఒక్క ఫొటోతో ఝలక్!

కలం, వెబ్ డెస్క్ : ప్రముఖ నటుడు, తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ ( Vijay), నటి త్రిష కృష్ణన్ (Trisha )రిలేషన్ షిప్ లో ఉన్నారనే ప్రచారం జరుగుతున్న వేళ నిన్న ఆయన పుట్టిన రోజు సందర్భంగా త్రిష అభినందనలు తెలపకపోవడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. దీనికితోడు మంగళవారం ఉదయం ఇన్ స్టాలో విజయ్ ను త్రిష అన్ ఫాలో చేయడం తీవ్ర చర్చకు దారి తీసింది. విజయ్, త్రిష మధ్య గ్యాప్ పెరిగిందని.. వారిద్దరు బ్రేకప్ చెప్పుకున్నారని నెట్టింట పుకార్లు షీకార్లు చేశాయి. అయితే తాజాగా ఇన్ స్టాలో ఒకే ఒక్క ఫొటో షేర్ చేసిన త్రిష బ్రేకప్ ప్రచారం చేసిన వారికి ఝలక్ ఇచ్చింది.

ఈ మేరకు అర్థరాత్రి విజయ్ తో కేక్ కట్ చేయించిన ఫోటోను తాజాగా ఇన్ స్టాలో త్రిష షేర్ చేసింది. ‘’వీటన్నింటినీ విలువైన వాటిగా మార్చే వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు (00.00)’’ అంటూ విజయ్ పక్కన చిరునవ్వులు చిందిస్తున్న ఫోటోను పోస్ట్ చేసింది.  జూన్ 22 అర్ధరాత్రి ‘00.00’ గంటలకే విజయ్ కు  తాను మొదటగా బర్త్ డే విషెస్ చెప్పినట్లు ఆమె స్పష్టం చేసింది. దీంతో విజయ్ తో త్రిష బ్రేకప్ అయిందనే వార్తలకు ఒకే ఒక్క ఫొటోతో ఆమె చెక్ పెట్టారు.

తమిళనాడు ఎన్నికల ముందు నుంచి త్రిష, విజయ్ రిలేషన్ షిప్ అంశం హాట్ టాపిక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే విజయ్​ భార్య విడాకులు కోరడం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇక విజయ్ సీఎం అయిన తర్వాత కూడా వీరి జోడి జంటగా కనిపిస్తోంది.  కొన్ని కార్యక్రమాలకు విజయ్  త్రిషను వెంటబెట్టుకుని పోతున్నారు. దీంతో త్వరలో ఈ కపుల్స్ పెళ్లికి సిద్ధం అవుతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>