కలం, మహబూబ్‌నగర్ బ్యూరో : విద్యావ్యవస్థలో రోజురోజుకు పెరుగుతున్న అసమానతల మూలంగానే విద్యార్థుల మధ్య అంతరాలు ఏర్పడుతున్నాయని మహబూబ్‌నగర్ డిసిసి అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ (Sanjeev Mudiraj) ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం మహబూబ్‌నగర్‌లోని జె జె ఆర్ ఫంక్షన్ హాల్ లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ప్రారంభించిన ఛాత్రోకి గూంజ్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు మార్గదర్శనం చేశారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న పేపర్ లీకులు, పరీక్షల అక్రమాలు, నిరుద్యోగం, ఉద్యోగ నియామకాల ఆలస్యం, విద్యా వ్యవస్థలో పెరుగుతున్న అసమానతలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
రాహుల్ గాంధీ కోటాలో లేవనెత్తిన అంశాలను ప్రస్తావిస్తూ.. “ప్రస్తుతం లీక్ అవుతున్నది కేవలం ప్రశ్నాపత్రం కాదు. పేద, మధ్యతరగతి కుటుంబాల ఆశలు, తల్లిదండ్రుల కష్టార్జిత సంపాదన, విద్యార్థుల భవిష్యత్తు లీక్ అవుతోంది” అని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం పేపర్ లీకులను అరికట్టడంలో పూర్తిగా విఫలమైందని, అసలు దోషులను పట్టుకోవడం కంటే విద్యార్థులపైనే ఆంక్షలు విధించడం దురదృష్టకరమని విమర్శించారు. దేశ యువత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తుంటే కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగ సమస్యను పట్టించుకోవడం లేదని ఆయన (Sanjeev Mudiraj) మండిపడ్డారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందన్నారు.
జిల్లా వ్యాప్తంగా ప్రతి కళాశాల, ప్రతి మండలం, ప్రతి గ్రామంలో యువత గొంతుకను ప్రభుత్వాలకు వినిపించే కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం ఆగదన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదులా కోత్వాల్, మేయర్ గుమ్మల మమత శ్రీనివాస్ , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏపీ మిథున్ రెడ్డి , మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కరి అనితా రెడ్డి , డీసీసీ కమిటీ సభ్యులు సత్తూర్ చంద్రకుమార్ గౌడ్ , బెక్కరి మధుసూదన్ రెడ్డి , రమేష్ శెట్టి, కార్పొరేటర్లు ఎంపీ ప్రవీణ్ కుమార్, ఉమర్ కోత్వాల్, అవేజ్, కాంగ్రెస్ నాయకులు మక్సూద్, జడ్చర్ల కిరణ్, వినయ్ కుమార్ , ఎన్ఎస్యూఐ నాయకులు నరేష్, అమాద్, తదితరులు పాల్గొన్నారు.
Read Also: రమ్మంటున్న కేటీఆర్.. రానంటున్న కేసీఆర్!
Follow Us On : WhatsApp

