కల వెబ్ డెస్క్ : ఏపీలోని పల్నాడు(Palnadu)లో దారుణ ఘటన చోటు చేసుకుంది. దుర్గి మండలం అడిగొప్పలలో ఇద్దరు టీడీపీ(TDP) కార్యకర్తలను దుండగులు నరికి హత్య చేశారు. హత్యకు గురైన ఇద్దరు సొంత అన్నదమ్ములు కావడం గమనార్హం. అన్నదమ్ములు హనుమంతు, శ్రీరామమూర్తిలను ఆదివారం అర్థరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కొడవళ్లతో దారుణంగా నరికి చంపారు. గ్రామంలోని బొడ్రాయి దగ్గర హనుమంతు, వాటర్ ప్లాంట్ వద్ద శ్రీరామమూర్తిల మృతదేహాలు లభ్యమయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించి దర్యాప్తు చేపట్టారు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే హత్యలు జరిగి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
Read Also: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎస్ సోమేష్‌కుమార్‌కు సిట్ నోటీసులు
Follow Us On: Youtube


