Mobile Popup Ad
Mobile Popup Ad

డ్రగ్స్ నిర్మూలన అవగాహన కార్యక్రమాలు ప్రారంభం

కలం, కరీంనగర్ బ్యూరో: అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం (జూన్-26) సందర్భంగా జిల్లాలో యాంటీ డ్రగ్ అవేర్‌నెస్ వీక్ కార్యక్రమాల పోస్టర్లను పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ( Karimnagar Police) విడుదల చేసి ప్రారంభించారు. జిల్లా పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలను సోమవారం సీపీ కార్యాలయంలో లాంచ్ చేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. యాంటీ డ్రగ్ అవేర్‌నెస్ వీక్ కార్యక్రమాలల్లో భాగంగా పాఠశాలలు, కళాశాలల్లో మాదకద్రవ్యాల దుష్పరిణామాలపై అవగాహన సదస్సులు, డ్రగ్స్‌కు వ్యతిరేకంగా సంతకాల సేకరణ, డ్రగ్-ఫ్రీ క్యాంపస్ డిక్లరేషన్ కార్యక్రమాలు, కమ్యూనిటీ విజిలెన్స్ కమిటీల ఏర్పాటు వంటి కార్యక్రమాలు వారం రోజుల పాటు నిర్వహించనున్నట్లు తెలిపారు. యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రజలు అప్రమత్తంగా ఉండి పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు. మాదకద్రవ్యాల నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>