కలం, కరీంనగర్ బ్యూరో: జిల్లాలో అల్గునూరు వద్ద ఆర్టీసీ బస్సు దగ్ధం జరిగిన ప్రమాదంలో 40 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడి దైర్య సాహసాన్ని చూపిన కరీంనగర్ ఆర్టీసి 2 డిపోకు చెందిన బస్సు డ్రైవర్ బోయిని ప్రశాంత్ ను తెలంగాణ రక్షణ సేన (Karimnagar TRS) జిల్లా బాధ్యుడు గుంజపడుగు హరిప్రసాద్ ఆద్వర్యంలో సోమవారం సన్మానం చేసి అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కరీంనగర్ 2 డిపోకు చెందిన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు పూర్తిగా దగ్ధం అవుతున్న సందర్భంలో సమయస్ఫూర్తితో బస్సు డ్రైవర్ బోయిని ప్రశాంత్ ప్రయాణికుల ప్రాణాలను కాపాడడంలో వ్యవహరించిన తీరు అభినందనీయమని కొనియాడారు.
ఇలాంటి ఘటనలపై చర్యలు తీసుకోవాలి..
సమయానికి బస్సును ఆపి ప్రయాణికులందరినీ కిందికి దించడంతో దాదాపు 40 మంది ప్రాణాలను కాపాడగలిగారన్నారు. ప్రభుత్వం వెంటనే ఆర్టీసీ బస్సులు బయలుదేరే ముందు అన్ని విధాల తనిఖీలు చేసిన తరువాతనే బయటికు పంపాలని కోరారు. బస్సు కాలిపోవడానికి కారణాలను ఆరా తీసి, ఇటువంటి ఘటనలు పునరావృత్తం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పూర్తిస్థాయిలో విచారణ చేసి ఆర్టీసీ బస్సుల ప్రమాదాలను నివారించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదివాసి విభాగం అధ్యక్షుడు కుతాడి శ్రీనివాస్, జిల్లా సీనియర్ నాయకులు రంగరవేణి లక్ష్మణ్, జంగ అపర్ణ సాగర్, బాసావేణి రజేందర్, నూతి చరణ్, యండి హుస్సేన్, గర్షకుర్తి విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.

