Mobile Popup Ad
Mobile Popup Ad

‘మాపై ఆంక్షలు వద్దు’.. తెలంగాణ ప్రభుత్వానికి ఎస్బీఐ విన్నపం

కలం, వెబ్ డెస్క్: రాయదుర్గం భూముల విషయంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) వైఖరిపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇక నుంచి ఆ బ్యాంకుతో అన్ని రకాల ఆర్థిక లావాదేవీలను నిలిపివేయడంతో పాటు కేంద్ర ప్రభుత్వానికి కూడా ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన బ్యాంక్ అధికారులు.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావుతో అత్యవసరంగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా తమపై ఎలాంటి ఆంక్షలు విధించవద్దని బ్యాంక్ అధికారులు కోరినట్లు సమాచారం. ఆర్థిక సంబంధాలను వెంటనే తొలగించుకోవడంతో పాటు డిపాజిట్లను కూడా వెనక్కి తీసుకోవాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సీఎస్‌ను కోరినట్లు వివరించారు. ఈ సందర్భంగా బ్యాంక్ తీరుపై సీఎస్ మండిపడినట్లు తెలుస్తోంది. భూమి విషయంలో అవగాహన అంశాలను వారి ముందు పెట్టి ప్రశ్నించినట్లు సచివాలయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆంక్షల విషయంలో మాత్రం సీఎస్ నుంచి వారికి ఎలాంటి హామీ లభించలేదని చెబుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>