కలం, వెబ్ డెస్క్: మూసీ ప్రక్షాళనపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) స్పందించారు. ఈ ప్రక్షాళన పథకంపై బీఆర్ఎస్ పార్టీ తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రక్షాళన పేరిట పెద్ద స్కామ్ జరగబోతున్నదని కూడా బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. అయితే తాజాగా కేసీఆర్ మూసీ ప్రక్షాళనపై పరోక్షంగా స్పందించారు.
తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మూసీ(Musi) నది విషయంలో ఒక ఆలోచన చేశానని కేసీఆర్ (KCR) చెప్పారు. హైదరాబాద్‌లో ఫార్మారంగం పెట్టుబడులు విపరీతంగా ఉండటంతో వ్యర్థాలు మూసీ నదిలో కలుస్తున్నాయని చెప్పారు.
అయితే ఫార్మారంగం కూడా హైదరాబాద్ కు ఎంతో కీలకమని చెప్పారు. అందుకే ఫార్మారంగానికి నష్టం చేయకుండా.. మూసీ ప్రక్షాళన(Musi Rejuvenation) చేపట్టేలా ఒక ప్రణాళిక సిద్ధం చేయాలని భావించానని.. అందుకోసం కొందరు అధికారులను విదేశాలకు పంపించినట్టు కేసీఆర్ చెప్పారు. ఫార్మా ఇండస్ట్రీలను తరలించేందుకు తాము ఫార్మా సిటీకి రూపకల్పన చేశామని చెప్పారు. అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ, తొక్క సిటీ అంటూ ఆ భూములను అమ్ముకొనేందుకు కుట్రలు చేస్తోందని మండిపడ్డారు.
Read Also: గ్లోబల్ సమ్మిట్ పై కేసీఆర్ వ్యంగ్యాస్త్రాలు
Follow Us On: Instagram


